
ABOUT GSWS GSWS గురించి
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశంలో మరెక్కడా లేనన్ని ప్రజా సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నాయి. కేవలం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా అవి క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలయ్యేలా చూడ్డం కూడా తన బాధ్యతగా ఈ ప్రభుత్వం భావిస్తోంది.
నవశకం పోర్టల్ ద్వారా ఎలాంటి మధ్యవర్తి వ్యవస్థకు కానీ అవినీతికి కానీ తావు లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా వివిధ సంక్షేమ పథకాల నుంచి ప్రజలే నేరుగా లబ్ది పొందవచ్చు. సంక్షేమ పథకం మొదలైనప్పటి నుంచి దరఖాస్తు చేసుకుని లబ్ది పొందేవరకు ప్రతి అంశాన్ని నేరుగా ప్రజలే ఈ పోర్టల్లో చూసుకోవచ్చు. లబ్దిదారుడి దరఖాస్తు ఎప్పుడు, ఎక్కడ, ఏ దశలో ఉంది? తీసుకోవాల్సిన చర్యలేంటి ? వంటి విషయాలన్నీ ఇక ముందు ఏ దాపరికం లేకుండా ప్రజల ముందే నేరుగా ఉంచే అద్భుతమైన ప్రయత్నం ఇది.
ప్రజలు చేసుకున్న ప్రతి అర్జీకి కచ్చితమైన రశీదు, జవాబుదారితనం ఈ పోర్టల్ ద్వారా లభిస్తుంది. సంక్షేమ పథకాలు అందడంలో ఏదైనా సమస్య ఉంటే నేరుగా ప్రజలే ఈ పోర్టల్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది, అనవసర జాప్యం, ప్రలోభాలు లేకుండా అర్హుడైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు వీలైనంత త్వరగా అందించాలన్నదే ఈ ప్రభుత్వం లక్ష్యం.
Features ఫీచర్లు
Schemes పథకాలు